కలం, కరీంనగర్: ఈనెల 9వ తేదీన కరీంనగర్ (Karimnagar) వేదికగా ‘జనసేన ఆత్మీయ సభ’ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా నాయకుడు కందుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని భగత్ నగర్‌లోని శ్రీ కన్వెన్షన్‌లో జనసేన పార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కందుల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 9వ తేదీన స్థానిక వాసర గార్డెన్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ (RK Sagar) విచ్చేయనున్నారని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు చల్మెడ ఆనంద్ రావు ఆస్పత్రి ఎదురుగా నూతన జనసేన పార్టీ పార్లమెంటు స్థాయి కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం బైక్ ర్యాలీ ద్వారా కోర్టు చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయనున్నట్లు తెలిపారు. అనంతరం మార్కెట్ రోడ్‌లో ఉన్న అమరవీల స్థూపానికి నివాళులర్పించి కమాన్ మీదుగా బాసర గార్డెన్‌కి బైక్ ర్యాలీతో చేరుకోనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జనసేన (Janasena) పార్టీలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్(Karimnagar)కి చెందిన పొలాస వాసు నాగరాజు, ఖమ్మం శ్రీనివాస్, తిరుపతి, తిరుపతి సాయి గణేష్, అర్జున్, స్వామి తోపాటు 50 మందిని కందుల రాజిరెడ్డి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గం నాయకులు కాసరాజు, వీర్ల శ్రీనివాసరావు మహాదేవ రాజకుమార్, పొన్నాల తిరుపతి, వేణుగోపాల్ రెడ్డి, జంగ మహేష్, రేగుల హరీష్, గాలిపెల్లి కుమార్, అన్వేష్ రెడ్డి, కందగట్ల సరూప, వేముల శిరీష, శకుంతల సుజాత, కరీంనగర్ డివిజన్లోని ముఖ్య నాయకులు, మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
Also Read : గుజరాత్‌లో మిస్టరీ బావి.. కదులుతున్న నీరు!
Follow Us On : WhatsApp

