కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో టీపీసీసీ మేధావుల విభాగం (TPCC Intellectual Cell) రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ముఖ్య అతిథిగా హాజరైన ఈ సమావేశానికి మేధావుల విభాగం రాష్ట్ర చైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్ లో పార్టీ సంస్థాగత బలోపేతం, మేధావుల విభాగం విస్తరణ, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ వైఖరిపై చర్చించారు. అలాగే ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లే అంశాలపై విస్తృత చర్చ జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మేధావుల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మీటింగ్ కు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ దావల్, వైస్ చైర్మన్ పుష్ప లక్ష్మణ్, పలువురు రాష్ట్ర నాయకులు, మేధావుల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.

