కలం, సినిమా : యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) ప్రస్తుతం తన 24వ సినిమా చేస్తున్నాడు. అదే.. వృషకర్మ. దీనికి కార్తీక్ దండు డైరెక్టర్. భారీ థ్రిల్లర్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా టైటిల్ ను ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు అనౌన్స్ చేశారు. ఈ భారీ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. అయితే.. చైతూ 25వ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. చైతూ 25వ సినిమా ఎవరితో..? ఎప్పుడు..?
చైతూ 25 సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివతో చేయనున్నట్టుగా ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే.. దేవర 2 మళ్లీ ట్రాక్ లోకి రావడం వలనో ఏమో కానీ.. చైతూ, కొరటాల సినిమా ఇప్పట్లో లేనట్టే అని టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా చైతన్య నెక్ట్స్ మూవీని బెదురులంక డైరెక్టర్ క్లాక్స్ తో చేయనున్నట్టుగా ఓ వార్త లీకైంది. కెరీర్ లో మైలు రాయిగా నిలిచే సినిమాను స్టార్ డైరెక్టర్ తో చేయాలి కానీ.. ఇలా కేవలం ఒక్క సినిమా చేసిన డైరెక్టర్ తో.. అది కూడా చెప్పుకోదగ్గ సక్సెస్ సాధించలేని సినిమా దర్శకుడితో 25వ సినిమా చేయడమా అంటూ విమర్శలు వచ్చాయి.
ఇదిలా ఉంటే.. సితార నాగవంశీ (Naga Vamshi) తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో.. “చైతన్యతో (Naga Chaitanya) సినిమా చేయాలి అనుకుంటున్నాం. చైతన్య ఎప్పుడు కలసినా నాతోనే బ్యానర్ ను స్టార్ట్ చేసి, ఇప్పుడు నాతో సినిమా చేయడం లేదు అంటున్నాడు. ఈసారి చైతన్య 25వ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నాం. 25వ సినిమా లేదా 26వ సినిమాను ఖచ్చితంగా సితార బ్యానర్ లో చేస్తాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ జరుగుతోంది” అని చెప్పాడు నాగవంశీ. అయితే.. డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం లీక్ చేయలేదు. దీంతో చైతూ 25 సినిమా ఎవరితో అనేది మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Read Also: మహేశ్ బాబు బిగ్ ప్లాన్.. వారణాసి తర్వాత అదిరిపోయే ప్రాజెక్ట్‌తో!
Follow Us On: Pinterest


