కలం వెబ్ డెస్క్ : మహిళల వస్త్రధారణ(Womens dressing)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శివాజీ(Actor Shivaji) నేడు తెలంగాణ మహిళా కమిషన్(Telangana Womens Commission) ఎదుట విచారణకు హాజరయ్యారు. దండోరా సినిమాకు సంబంధించిన ఓ వేడుకలో శివాజీ హీరోయిన్లు, స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ అసభ్య పదజాలంతో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇది టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో శివాజీ ఆయన వ్యాఖ్యలకు క్షమాపణ(apology) కూడా చెప్పారు. ఈ క్షమాపణలను పరిగణలోకి తీసుకోని మహిళా కమిషన్ ఆయనను విచారణకు రావాలని నోటీసులు(notice) జారీ చేసింది. శనివారం ఉదయం విచారణకు హాజరైన శివాజీని రెండు గంటల పాటు విచారణ చేసింది. ఈ సందర్భంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది.
మహిళలపై శివాజీ (Actor Shivaji) చేసిన కామెంట్లు వారి గౌరవం, వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయని కమిషన్ వ్యాఖ్యానించింది. దీనిపై ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించింది. సినీ నటుడై ఉండి, తన వ్యాఖ్యలు సమాజంపై ప్రభావం చూపుతాయన్న విషయం తెలిసీ ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారని నిలదీసింది. మహిళల వస్త్రధారణతో వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయించడం ఎంత వరకూ సరైందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలియదా అని అడిగింది. శివాజీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్లు లేకపోతే దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరింది.
Read Also: శివాజీ మాట్లాడింది ముమ్మాటికీ తప్పు: ప్రకాశ్ రాజ్
Follow Us On: Youtube


