అమీన్‌పూర్‌లో భారీ చిట్టీల మోసం

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్‌పూర్ (Ameenpur) పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ఆర్ కాలనీలో భారీ చిట్టీల మోసం (Chit Fund Fraud) వెలుగులోకి వచ్చింది. బీఎస్ఆర్ కాలనీకి చెందిన శిరీష, సాంబశివరావు దంపతులు చిట్టీల పేరుతో సుమారు రూ.2.5 కోట్ల వరకు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా పరారైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అదే కాలనీకి చెందిన తిరుపతమ్మ అనే మహిళ, మరో 20 మంది బాధితులు అమీన్‌పూర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

నిందితులు గత 20 ఏళ్లుగా అమీన్‌పూర్ పరిధిలో నివాసముంటున్నారని, బీఎస్ఆర్ కాలనీలో సొంత ఇల్లు నిర్మించుకుని గత 10 నుంచి 12 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. చిట్టీల పేరుతో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించి, వడ్డీలు, చిట్టీ సొమ్ము చెల్లించకుండా ఇటీవల తమ సొంత ఇంటిని కూడా విక్రయించి పరారయ్యారు. ఈ ఘటన(Chit Fund Fraud)పై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.

Also Read : ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల ఫలితాలు విడుదల

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>