ప్రజా సమస్యలే పోలీసుల తొలి ప్రాధాన్యం : ఎస్పీ సునీత రెడ్డి

కలం, వనపర్తి : ప్రజల సమస్యలను నేరుగా విని, చట్టబద్ధంగా వేగవంతంగా పరిష్కరించడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి (Wanaparthy SP) తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 22 ఫిర్యాదులు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు తమ సమస్యలను నిర్భయంగా వినిపించే విశ్వసనీయ వేదికగా మారిందన్నారు. ప్రతి ఫిర్యాదును సున్నితంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని చట్టబద్ధంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు శాఖ అంకితభావంతో పనిచేస్తోందన్నారు. ప్రజలు పోలీసు శాఖపై విశ్వాసం ఉంచి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజావాణిలో 15 భూ తగాదాలు, 5 పరస్పర గొడవలు,2 భార్యాభర్తల వివాదాలు సంబంధించిన ఫిర్యాదులు అందాయని తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>