కలం, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్ రావు (Velichala Rajender Rao) ను కరీంనగర్ (Karimnagar) జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నూతనంగా నియమితులైన అనంతుల రమేష్ (Ananthula Ramesh) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేందర్ రావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన రమేష్‌కు వెలిచాల రాజేందర్ రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ తిప్పికొట్టేలా పనిచేయాలని రాజేందర్ రావు సూచించారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని రమేష్‌కు తెలిపారు. తనను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించేందుకు సహకరించిన వెలిచాల రాజేందర్ రావుకు అనంతుల రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ కార్యక్రమాల కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.

