ఎంపీ అరవింద్ కారుకు యాక్సిడెంట్.. తప్పిన ప్రమాదం!

కలం, వెబ్ డెస్క్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (MP Arvind) ప్రయాణిస్తున్న వాహనం మేడ్చల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైంది. నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా రేకబావుల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రేకబావుల సమీపంలో అడ్డుగా వచ్చిన మరో కారును ఎంపీ అరవింద్‌ ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో అక్కడ ఉన్న వారికి, అలాగే ఎంపీకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రమాదం అనంతరం ఎంపీ స్వయంగా వాహనం నుంచి బయటకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. అక్కడి పరిస్థితులను సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ ఘటనతో మేడ్చల్‌ జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, రెండు వాహనాలకు జరిగిన నష్టం తదితర అంశాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>