ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలి : పోలాడి రామారావు

కలం, కరీంనగర్ బ్యూరో: అన్ని వర్గాలకు ఇచ్చిన హామీల అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి విడనాడాలని, పెండింగులో ఉన్న 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు (Poladi Rama Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కరీంనగర్‌లో ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థుల పైచదువుల కోసం, ఉద్యోగాల దరఖాస్తుల నిమిత్తం ఆయా కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. గతంలో లాగా పాత పద్ధతి లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయుటకు చర్యలు చేపట్టాలని కోరారు.

మెస్ చార్జీలను పెంచాలని, ఖాళీగా ఉన్న వేలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్నదాతలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం వీడి ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు లేకుంటే పాలకులు మూల్యం చెల్లించుకోక తప్పదని పోలాడి రామారావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు అండెం రమణారెడ్డి, దడిగల వెంకటేశ్వర్ రావు, ల్యాగల వీరారెడ్డి, అంచూరి సాధానందం, విక్రమ్ సింహారావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>