ప్రజావాణి బాధితులకు వెంటనే న్యాయం అందించాలి: నిర్మల్ ఎస్పీ జానకి

కలం, నిర్మల్: బాధితుల సమస్యలను సత్వరంగా, పారదర్శకంగా పరిష్కరించడమే ప్రజావాణి ప్రధాన ఉద్దేశమని నిర్మల్ జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజావాణి లక్ష్యమని తెలిపారు.

పోలీస్ స్టేషన్‌‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి వినతులను స్వీకరించాలని సూచించారు. అవసరమైనచోట క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చట్టప్రకారం న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.

Also Read : ‘నా గెలుపు బీజేపీకి ఒక సందేశం’​.. పీకే కీలక వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>