కలం, వెబ్ డెస్క్ : అమెరికాలో ఉన్నత విద్యకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటూ తనపై వస్తున్న ఆరోపణలపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) స్పందించారు. తన ఉన్నత చదువులపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఉన్నత చదువుల్లో కుటుంబంపై ఆధారపడలేదని, బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చిన స్కాలర్‌షిప్‌తో పాటు విద్య రుణం ద్వారా చదువు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ(PM Modi)కి అభిజీత్ దీప్కే సంచలన సవాల్ విసిరారు.
తన స్కాలర్‌షిప్ లెటర్‌తో పాటు ఎడ్యుకేషన్ లోన్ లెటర్ కూడా చూపిస్తానని.. మరి ప్రధాని మోదీ కూడా తన డిగ్రీ చూపించగలరా? అని అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) సవాల్ విసిరారు. మోదీ డిగ్రీని చూపించి, దానిని బహిరంగ పరిస్తే తన పత్రాలను కూడా బహిరంగపరచడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా, సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ ఇటీవల దీప్కే కుటంబ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలని పలు సంస్థలను కోరాడు. ఈ నేపథ్యంలోనే అభిజిత్ దీప్కే తాజా వ్యాఖ్యలు చేశారు.
Also Read : తిట్టడం గొప్ప కాదు.. యువతకు మను బాకర్ హితవు!
Follow Us On : WhatsApp

