కలం, వెబ్ డెస్క్: మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటుడు శివాజీ (Actor Shivaji) శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యాడు. ఇటీవల దండోరా మూవీ ఫంక్షన్ లో శివాజీ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మహిళా సంఘాలు, కొంతమంది నటీమణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
దీంతో ఆ మరుసటి రోజు మీడియా ముందుకొచ్చిన శివాజీ (Actor Shivaji) సారీ చెప్పాడు. తాను చేసిన అభ్యంతర వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశాడు. అయితే శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో ఆయన శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. మరి వివరణ పట్ల మహిళా కమిషన్ శాంతిస్తుందా? లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: హైదరాబాద్లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు
Follow Us On: Youtube


