కలం వెబ్ డెస్క్ : కేటీఆర్ (KTR) వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, తన తప్పులు తెలుసుకొని పెద్దస్థాయి వాళ్లతో మర్యాదగా మాట్లాడాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) వ్యాఖ్యానించారు. శనివారం దానం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకోవాలన్నారు. గురివింద గింజ తన కింద నలుపు ఎరుగదన్నట్లు కేటీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్నికలు రావడానికి ఇంకా సమయం ఉందని, గెలుపు, ఓటములు పక్కన పెట్టాలన్నారు.
ఒక స్థాయిలో ఉన్న వారి గురించి మనం ఎలా మాట్లాడితే వారు ఆ స్థాయికి దిగి మాట్లాడుతారన్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం. నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదని చెప్పారు. ఆయన పదవికి గౌరవమివ్వాలని సూచించారు. రాజకీయంగా ఎలాంటి విమర్శలైనా చేయొచ్చు కానీ, వ్యక్తిగతంగా రాకూడదన్నారు. కేటీఆర్ అభివృద్ధిపై చర్చకు వస్తే సీఎం, మంత్రులు ఏం చేశారన్నది చెప్తారన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కి మంత్రుల అవినీతి పై సమాచారం ఉంటే చర్యలు తీసుకోవాలన్నారు. ఆరు సార్లు కార్యకర్తల అండతోనే గెలిచానని, మళ్లీ ఉప ఎన్నిక వచ్చినా ఖైరతాబాద్ లో విజయం సాధిస్తానని దానం (Danam Nagender) తెలిపారు.
Read Also: స్టీల్ ప్లాంట్‌పై మోడీ, బాబు పవన్‌లది యాక్టింగ్ – జగ్గారెడ్డి
Follow Us On: X(Twitter)


