చెరుకు పండిస్తున్నాం.. ఫ్యాక్టరీని తెరిపించండి: రైతుల డిమాండ్

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లాలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని రైతులు ప్రభుత్వాన్ని అడిగినప్పుడల్లా మీరు చెరుకు పెట్టడం లేదని ప్రభుత్వ పెద్దలు అంటున్నారని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం (Nizamabad NCSF) కన్వీనర్ ఆకుల పాపయ్య అన్నారు. అయితే ప్రభుత్వం చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తామంటే రైతులందరం చెరుకు పండించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ మేరకు ఇదిగో చెరుకు పండిస్తున్నాం.. మీరు చక్కెర ఫ్యాక్టరీని ఎప్పుడు తెరిపిస్తారో చెప్పండి అంటూ ప్రభుత్వానికి సవాల్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దూపల్లిలో అత్యధికంగా ఫ్యాక్టరీకి చెరుకు తోలిన దూపల్లి లక్ష్మారెడ్డి చెరుకు తోటలో చెరుకు రైతుల సమావేశం జరిగింది. గత పాలకుల తప్పుడు విధానాలు ఆనాటి అవినీతి అధికారుల మూలంగా మంచి లాభాల బాటలో నడచిన సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ (Sarangapur Sugar Factory)ని మూసివేశారని దూపల్లి లక్ష్మారెడ్డి ఆరోపించారు.

జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ చక్కెర ఫ్యాక్టరీ పరిధిలో నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని 110 గ్రామాల రైతులు చెరుకు పండించి ఫ్యాక్టరీ పంపారని ఈ ప్రాంత రైతులకు చెరుకు పండించిన అనుభవం ఉందని వారన్నారు. మహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి లాంటి ప్రభుత్వ పెద్దలంతా సారంగపుర్ నిజాం సహకార చక్కెర ఫ్యాక్టరీని తెరిపించి దాన్ని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపే విధంగా తగిన కృషి చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో లక్ష్మారెడ్డి, సంతోష్, సిర్పూర్ గంగారెడ్డి, వేల్పూర్ భూమయ్య, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read : పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ: భట్టి విక్రమార్క

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>