కాంగ్రెస్ ఎమ్మెల్యే కారులో ప్రమాదం!

కలం, వెబ్ డెస్క్ : డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ (Ramachandru Naik) ప్రయాణిస్తున్న వాహనంలో ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన తన వాహనంలో వెళ్తుండగా, చింతపల్లి గ్రామం వద్ద కారులో ఉన్న పవర్ బ్యాంక్ పేలిపోయింది. దీంతో కారు క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు, మంట చెలరేగాయి.

ఈ అకస్మాత్తు పరిణామంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌ను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ఆయనకు పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>