అమరుల పోరాట స్ఫూర్తితో తెలంగాణను కాపాడుకోవాలి: బీఆర్ఎస్

కలం, కరీంనగర్‌: అమరుల పోరాట స్ఫూర్తితో తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ పొన్నం అనిల్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. సెప్టెంబర్‌ 17 సందర్భంగా కొత్తపల్లి మండలం చింతకుంట (Chinthakunta) లోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో (BRS Office) గురువారం జాతీయ సమైక్యతా దినోత్సవ (Jatiya Samaikyata Dinotsavam) వేడుకలు నిర్వహించారు. నారదాసు లక్ష్మణరావు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం జై తెలంగాణ నినాదాలు చేశారు.

చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్న నాయకులు

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం ఎందరో అమరులు పోరాడారని గుర్తుచేశారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేతృత్వంలో భారత సైన్యం హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన చారిత్రక ఘట్టాన్ని వివరించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. సెక్యులర్‌ రాష్ట్రంగా తెలంగాణ వర్ధిల్లిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి మహేష్, మాజీ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, నారదాసు వసంత రావు, గంటల రేణుక, పలు డివిజన్‌ల అధ్యక్షులు ఆరే రవి గౌడ్, పటేల్ సుధీర్ రెడ్డి, నియోజక వర్గ యూత్ అధ్యక్షులు గంగాధర చందు, నగర బీఆర్ఎస్‌వీ అధ్యక్షులు బొంకూరి మోహన్, మిడిదొడ్డి నవీన్, బోనాల శ్రవణ్, కలర్ సత్తన్న, కమల్ గౌడ్, నిజమొద్దిన్, సర్వర్, అన్వేష్‌లతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>