కలం, వెబ్‌డెస్క్: స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రణబాలి (Ranabaali) షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని మూవీ టీం గురువారం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. సరిగ్గా 29 రోజులకు థియేటర్లలో కలుసుకుందాం అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. రానున్న దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16న రణబాలి వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ యోధుడిగా రణబాలి పాత్రలో నటిస్తుండగా, ఆయన భార్య జయమ్మ పాత్రలో రష్మిక మందన్న కనిపించనున్నారు.
రియల్ లైఫ్ మ్యారేజ్ తర్వాత ఈ క్రేజీ కపుల్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పవన్ బాసంసెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అజయ్-అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఏందయ్య సామి పాట సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఫుల్ మూవీ కోసం రష్మిక్, విజయ్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

