కలం, వెబ్ డెస్క్: న్యూయర్ వేడుకలు సమీపిస్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు, ఫంక్షన్ల సందడి మొదలైంది. కొన్ని చోట్లా గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ పార్టీలు (Drugs Party) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మాసబ్ట్యాంక్‌లో డ్రగ్స్ పార్టీ జరిగినట్టు, అందులో ఓ ప్రముఖ హీరోయిన్ సోదరుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హీరోయిన్ సోదరుడి కోసం ఈగల్ టీం, మాసబ్ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో నితిన్ సింఘానియా.. శ్రనిక్ సింఘ్వీలను పోలీసులు అరెస్ట్ చేయగా, టాలీవుడ్, బాలీవుడ్‌లో గుర్తింపు ఉన్న ప్రముఖ నటి (Heroine) సోదరుడి ఉన్నట్లు భావిస్తున్నారు.


