కలం, ఖమ్మం బ్యూరో : “YERU – The River Festival”లో భాగంగా రేపు (శనివారం) భద్రాచలం తెప్పోత్సవ ఘాట్ వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుండి మొదలయ్యే ఈ కార్యక్రమంలో గోదావరి (Godavari) నది హారతి కార్యక్రమం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. సుమారు 230 మంది స్థానిక యువత పాల్గొనే ఫ్లాష్ మోబ్ పెర్ఫార్మెన్స్ (ఒకేసారి నృత్యం) గోదావరి (Godavari) వద్ద ప్రధాన ఆకర్షణగా ఉండబోతోంది. యువత సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు, నదుల పట్ల అవగాహనను పెంపొందించే విధంగా ఈ ప్రదర్శనలు రూపొందించామని అధికారులు తెలిపారు.
Read Also: హైదరాబాద్లో భారీగా తగ్గిన ఇళ్ల అమ్మకాలు
Follow Us On: X(Twitter)


