భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్‌లో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) వీరవిహారం చేస్తున్నాడు. బంతితో విండీస్ బ్యాటర్లకు దడ పుట్టిస్తోంది. రెండో టెస్ట్‌లో టీమిండియా బ్యాటర్ల అదరగొట్టారు. 518/5కి డిక్లేర్ చేశారు. బ్యాట్‌తో విండీస్ బౌలర్ల చితకబాదిన టీమిండియా బౌలింగ్‌లో కూడా తన ఆధిపత్యం కనబరుస్తోంది. కరేబియన్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. అందులోనూ రవీంద్ర జడేజా బంతితో బెంబేలెత్తించేస్తున్నాడు. రెండో రోజు సమయం ముగిసేసరికి జడేజా 3/37తో అదరగొట్టాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 140/4గా ఉంది. ప్రస్తుతం టెవిన్ ఇమ్లాచ్.. 31 బంతుల్లో 14 పరుగులు, షైయ్ హోప్.. 46 బంతుల్లో 31 పరుగులు చేసిన క్రీజ్‌లో ఉన్నారు.
విండీస్‌కు ఇంకా 378 పురుగులు కావాలి. విండీస్ ఓపెనర్ జాన్ కాంప్‌బెల్ (10, త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్(34)ను జడేజా(Ravindra Jadeja) ఔట్ చేశాడు. కాంప్‌బెల్ బలమైన స్లాగ్ స్వీప్ షాట్ ఆడగా.. ఫార్వర్డ్ షార్ట్‌లెగ్‌లో సాయి సుదర్శన్ క్యాచ్ పట్టాడు. త్యాగ్‌నారాయణ్.. కేఎల్ రాహుల్‌కు చిక్కాడు. కొద్దిసేపటికే అథనాజ్‌ను కుల్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. తర్వాతి ఓవర్‌లోనే రోస్టన్ ఛేజ్ (0) జడేజాకు క్యాచ్ ఇచ్చాడు.

