కలం, సినిమా : నేచురల్ స్టార్ నాని (Hero Nani) వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్యారడైజ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తోన్న ఈ మూవీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. మార్చి 26న పాన్ ఇండియా మూవీగా ధియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే.. ఈ సినిమా తర్వా నాని.. ఓజీ డైరెక్టర్ సుజిత్ తో సినిమా చేయనున్నాడు. ఆతర్వాత నాని సినిమా ఎవరితో అంటే.. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో చేయబోతున్నాడని తెలిసింది. అయితే.. దీనికి డైరెక్టర్ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాని (Hero Nani) జెర్సీ అనే సినిమా చేయడం.. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మళ్లీ నానితో సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ సినిమా చేయాలి అనుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీ కన్ ఫర్మ్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సితార నాగవంశీ బయటపెట్టారు. 2026లో ఖచ్చితంగా నానితో సినిమా ఉంటుందని చెప్పారు కానీ.. డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం బయటపెట్టలేదు. ఇక అక్కడ నుంచి ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది.
అయితే.. జెర్సీ సినిమాను తీసిన గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. కింగ్ డమ్ డిజాస్టర్ అవ్వడంతో మరో సినిమా ఇంత వరకు సెట్ కాలేదు. కింగ్ డమ్ నిర్మించింది కూడా ఈ సంస్థే కాబట్టి ఈ బ్యానర్ లో నానితో సినిమాని గౌతమ్ తిన్ననూరే చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అలాగే హాయ్ నాన్న తర్వాత డైరెక్టర్ శౌర్యవ్ ఇంత వరకు కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. ఆమధ్య నానితోనే శౌర్యవ్ సినిమా అంటూ వార్తలు వచ్చాయి. సో.. నానితో సితార సంస్థ చేసే సినిమాకి దర్శకుడు గౌతమ్ కానీ.. శౌర్యవ్ కానీ కావచ్చని టాక్ వినిపిస్తోంది. మరి.. త్వరలో అనౌన్స్ చేస్తారేమో చూడాలి.
Read Also: ‘అనగనగా ఒక రాజు’ నుంచి ‘రాజు గారి పెళ్లి రో’ ఫుల్ సాంగ్ అవుట్
Follow Us On: Pinterest


