మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan)పై ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్(Koona Ravi Kumar) ఘాటు విమర్శలు చేశారు. కల్తీ మద్యం గురించి జగన్ అండ్ కో మాట్లాడటం.. దెయ్యాలు వేదాలు వల్లెవేస్తున్నట్లు ఉందంటూ చురకలంటించారు. జగన్‌వి వింత పోకడలని అన్నారు. చిల్లర మనిషిలా ప్రవర్తించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడిచిన 75ఏళ్ల స్వతంత్ర్య భారత చరిత్రలో కల్తీ మద్యానికి జగన్.. మూల విరాట్ లాంటి వారంటూ విమర్శలు గుప్పించారు. కల్తీ మద్యానికి సూత్రధారి ఎక్కడా? అంటే అందరి చూపులు తాడెపల్లి ప్యాలెస్ వైపే చూస్తున్నాయని విసుర్లు విసిరారు. కల్తీ మద్యం అమ్మించి వేల కోట్లు దోపిడీ చేశారని, వాటిని డొల్ల కంపెనీల ద్వారా వ్యాపారంలో పెట్టించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. దమ్ముంటే కల్తీమ్యంపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.

