కలం, వెబ్ డెస్క్ : ఉపాధిహామీ పథకం పేరును మార్చడం అంటే ఆ పథకాన్ని నీరు గార్చేందుకు కుట్ర చేయడమే అన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Goud). శుక్రవారం ఆయన మీడియాతో ఈ విషయంపై మాట్లాడారు. బీజేపీ కేవలం సెంటిమెంట్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. ఈ పథకంలో గాంధీ పేరును తీసేయడంపై ఎల్లుండి తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నిరసన తెలుపుతామన్నారు మహేశ్ కుమార్ గౌడ్. గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ఉంటుందని.. కార్యకర్తలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ విగ్రహాల వద్ద ఈ నిరసన ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసి ఢిల్లీ దాకా తెలియజేస్తామన్నారు మహేశ్ కుమార్ గౌడ్.
Read Also: రేవంత్ నిన్ను కొడంగల్‌లో గెలవనివ్వను: కేటీఆర్
Follow Us On: Pinterest


