కలం, వెబ్ డెస్క్: ప్రతిభకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). బిహార్‌కు చెందిన ఈ యువ క్రికెటర్ తన అసాధారణ బ్యాటింగ్‌తో అదరకొడుతున్నాడు. మరోసారి ఈ యంగ్ తరంగ్ అందరి దృష్టిని ఆకర్షించాడు. కేంద్రం ప్రభుత్వం బాలలకు ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నాడు. శుక్రవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా ‘రాష్ట్రీయ బాల్ పురస్కార్’ (Rashtriya Bal Puraskar) అవార్డు అందుకున్నాడు.
ఈ అవార్డు వైభవ్ కెరీర్‌లోనే ఒక చారిత్రాత్మక అధ్యాయాన్ని తెలియజేస్తోంది. క్రీడారంగంలో (Sports) అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన బిహార్ తొలి మ్యాచ్‌లో వైభవ్ (Vaibhav Suryavanshi) మరోసారి హైలైట్‌గా నిలిచాడు. కేవలం 84 బంతుల్లో 190 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఈ జాతీయ అవార్డులు 5 నుంచి 18 వయసున్న పిల్లలకు ఏడు విభాగాలను అందిస్తారు. ధైర్యం, కళలు, సంస్కృతి, పర్యావరణం, ఆవిష్కరణలు, సాంకేతికత, సామాజిక సేవల్లో ప్రతిభ చాటిన పిల్లలకు రాష్ట్రీయ బాల్ పురస్కార్ కేంద్రం అందజేస్తుంది.
Read Also: 32 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన విజ్ఞేష్ పుతుర్
Follow Us On: Youtube


