మంత్రివ‌ర్గంలో అవ‌కాశం ఇవ్వండి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రిక్వెస్ట్​..!

క‌లం, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్​ (Congress) పార్టీలో కోమటి రెడ్డి రాజగోపాల్​ రెడ్డి మంత్రి పదవి కోసం బహిరంగంగానే కీలక వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో మరో నేత తనకూ మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని రిక్వెస్ట్​ చేయడం హాట్​ టాపిక్​గా మారింది. జడ్చర్ల కాంగ్రెస్​ ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి (Anirudh Reddy) తన మనసులోని కోరికను బయటపెట్టారు. యువ నేతలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కోరారు. తమది నేషనల్​ పార్టీ అని, రీజనల్ పార్టీ లాగా చేతులు కట్టుకొని నిల్చోమని చెప్పారు. కాంగ్రెస్​లో ఖర్గే, రాహుల్​ గాంధీ, పీసీసీ ప్రెసిడెంట్​, సీఎం రేవంత్​, పీసీసీ ఇన్​ చార్జ్​ మీనాక్షి కలిసి నిర్ణయం తీసుకుంటారన్నారు.

ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయ్యింది కదా, మంత్రులను మార్చాలి అని కొందరు అంటున్నారని అనిరుధ్​ రెడ్డి (Anirudh Reddy) అన్నారు. ఎమ్మెల్యేగా తన అభిప్రాయం కూడా చెప్పే అవకాశం ఉందని చెప్పారు. చాలా మంది యువ నేతలు ఉన్నారని, ఇంజినీర్స్, డాక్టర్స్ ఉన్నారని, తమకు కూడా అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలే రాష్ట్రం కొత్త మంత్రులను చూడాలని కోరుకుంటున్నారని అనిరుధ్​ రెడ్డి అన్నారు. అయితే తమ బాస్​ సీఎం రేవంత్​, పీసీసీ చీఫ్​ మహేశ్​ అని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

Read Also: పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>