కలం, హనుమకొండ : దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ వరంగల్ (Warangal) కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద తాత మధు దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం ఏబిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడుతూ.. దళిత ప్రజా ప్రతినిధులను కక్షపూరితంగా అగ్రవర్ణాల్లోని రాజకీయ నాయకులు దూషించడం దారుణమని మంద నరేష్ అన్నారు. దళితులకు రాజకీయంగా పదవులు వస్తే అగ్రవర్ణాల్లోని రాజకీయ నాయకులు ఓర్చుకోవడం లేదన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎల్సీ తాత మధుని శాశ్వతంగా రాజకీయాల నుండి బహిష్కరించాలని మంద నరేష్ డిమాండ్ చేశారు. దళిత రాజకీయ నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకుల మీద ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని దళిత రాజకీయ నాయకుల జోలికి వస్తే ఊరుకోమని ఏ రాజకీయ పార్టీలో ఉన్నా తమ దళిత గిరిజన నాయకులను అవమానపరిస్తే సహించేది లేదని మంద నరేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబిఎస్ఎఫ్ నాయకులు ఇప్ప భరత్ నిశాంత్ ఆదిత్య కిరణ్ సాయి కళ్యాణ్ పాల్గొన్నారు.

