కలం, వెబ్ డెస్క్: సాధారణంగా మార్కెట్లో గుడ్ల ధరలు (Egg Prices) స్థిరంగా ఉంటాయి. అత్యవసర సమయంలోనే ధరలు పెరుగుతుంటాయి. కానీ చలికాలంలో గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. దేశ్యవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రూ. 8 లేదా అంతకంటే ఎక్కువ ధర ఉంది. అయితే ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎంతకాలం ఇలా ఉంటుంది? అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గుడ్ల వినియోగం డిసెంబర్ నుంచి జనవరి మధ్య ఎక్కువగా ఉంటుంది.
చల్లని వాతావరణం ప్రోటీన్-రిచ్ ఫుడ్స్‌కు డిమాండ్‌ను పెంచుతుంది. ఇళ్లు, హాస్టళ్లు, చిరు వ్యాపారులు ఎక్కువగా గుడ్లను వినియోగిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే దేశంలో (India) గుడ్లకు డిమాండ్ ఏర్పడింది. అయితే డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో గుడ్ల ధరలు (Egg Prices) పెరుగుతున్నాయి. సాధారణంగా ధరలు ఫిబ్రవరి నుండి తగ్గుముఖం పడతాయి. అప్పుడు ఉష్ణోగ్రతలు పెరిగి వినియోగం తగ్గుతుంది.
జనవరి వరకు ధరలు స్థిరంగా ఉంటాయని పౌల్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. రూ.5 లేదా రూ.6 గుడ్ల ఆశించే వినియోగదారులు నిరాశ తప్పకపోవచ్చు. అధిక ఖర్చులు, తక్కువ పొలాలు గుడ్లపై ప్రభావం చూపుతున్నాయి.
Read Also: అరకు కాఫీ అదరహో.. కేజీ ఎంతంటే!
Follow Us On: Instagram


