కలం వెబ్ డెస్క్ : టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) 100వ సినిమా గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈమధ్య షూటింగ్ స్టార్ట్ చేశారు. అయితే 100వ సినిమాను గ్రాండ్ లాంచ్ చేస్తానని.. ఓ సందర్భంలో నాగార్జున చెప్పారు. కానీ, ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్(Karthik) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) బ్యానర్‌పై నాగార్జున ఈ క్రేజీ మూవీని నిర్మిస్తున్నారు. అయితే.. ఎలాంటి అప్ డేట్ మాత్రం లేదు. కారణం ఏంటి..? తెర వెనుక ఏం జరుగుతోంది..?
నాగార్జున 100వ సినిమా కోసం చాలా కథలు విన్నారు. ఫైనల్ గా కార్తీక్ చెప్పిన స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పారు. ఇది పొలిటికల్ జోనర్ అని టాక్ వచ్చింది. ఆతర్వాత నాగార్జునకు బాగా కలిసొచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని.. ఇందులో అన్ని అంశాలు ఉంటాయని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. సీనియర్ హీరోయిన్స్ అనుష్క, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. నాగార్జున మాత్రం ఈ సినిమా గురించి ఎలాంటి న్యూస్ లీక్ కాకుండా చాలా సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు. దీంతో ఈ మూవీ వెనుక ఏం జరుగుతోంది అనేది ఆసక్తిగా మారింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఇది 100వ సినిమా కావడంతో నాగ్ (Nagarjuna) చాలా కేర్ తీసుకుంటున్నారట. ప్రతి రోజు షూట్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్ ఫుట్ ఎలా వచ్చిందో చెక్ చేస్తున్నారట. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అవుట్ ఫుట్ చూసుకుని అప్పుడు సినిమా గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేయాలి అనేది నాగ్ ప్లాన్ అని సమాచారం. ఈ క్రేజీ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇది 100 వ సినిమా కాబట్టి.. నాగచైతన్య, అఖిల్ తో గెస్ట్ రోల్స్ చేయించబోతున్నారని తెలిసింది. మొత్తానికి నాగ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. మరి.. నాగ్ 100వ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
Read Also: క్రిస్మస్ తర్వాత బాక్సింగ్ డే.. ఎందుకంత ప్రాధాన్యం
Follow Us On: X(Twitter)


