బండి సంజయ్ కార్యాలయం ముట్టడికి యత్నం

కలం, కరీంనగర్ బ్యూరో: నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలు కరీంనగర్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీశాయి. కరీంనగర్‌లో యుఎస్ఎఫ్ఐ కార్యకర్తలు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.‌

పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పర్యవేక్షణలో పోలీసులు మార్గమధ్యలోనే వారిని అరెస్టు చేసి స్టేషన్ తరలించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఎస్పీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యార్థులపై లాఠీఛార్జికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>