కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) లోని రూరల్ పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకు అక్కడి పోలీసులు బేడీలు వేశారు. తీవ్రమైన నేరాలు చేసిన ఖైదీలకు, నేరస్థులకు, దొంగల చేతులకు వేయాల్సిన బేడీలను, పోలీసులే నియమ నిబంధనలు పాటించకకుండా పోలీస్ స్టేషన్ గేటుకు వేసి కనిపించడంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే, ఈ ఘటనపై పోలీసు అధికారులు చెప్పిన సమాధానం వింతగా ఉంది. ‘పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇతరులు వారి బైక్ లు, ఇతర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ఈరోజు పోలీసు ఉన్నతాధికారులు వస్తుండటంతో గేటుకు తాళం వేయమని చెప్పాం. కానీ పొరపాటున వాళ్లు తాళానికి బదులు బేడీలు వేసి ఉండవచ్చు’ అని ఓ అధికారి తెలిపారు. స్టేషన్ కు బేడీ విషయం స్థానికంగా చర్చ జరగడంతో గేట్ కు ఉన్న బేడీలను తొలగించారు.

