epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నేతాజీ అవశేషాలు భారత్​కు తెప్పించండి.. రాష్ట్రపతికి ముని మనవడి లేఖ

కలం, వెబ్​డెస్క్​: జపాన్​ నుంచి నేతాజీ (Netaji Subhas Chandra Bose) అవశేషాలు భారత్​కు తెప్పించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన ముని మనవడు చంద్ర కుమార్​ బోస్​ గురువారం లేఖను రాశారు. లేఖలోని సారాంశం ఏంటంటే.. దేశ స్వతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆజాద్​ హింద్​ ఫౌజ్​ను సింగపూర్​లో నేతాజీ స్థాపించి 8 దశాబ్దాలు దాటిన సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్​ 21న ఘనంగా జరుపుకున్నాం. ఈ క్రమంలో ఢిల్లీలో ఇండియన్​ నేషనల్​ ఆర్మీ(ఐఎన్​ఏ) స్మారకాన్ని నిర్మించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది.

బ్రిటీష్​ పాలనలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఆ స్మారకంలో చోటు కల్పించనున్నందున.. అందులో నేతాజీ (Netaji Subhas Chandra Bose) అవశేషాలకూ చోటు కల్పించాలి. అందువల్ల జపాన్​ రాజధాని టోక్యోలోని రెంకోజీ టెంపుల్​లో భద్రంగా ఉన్న నేతాజీ అవశేషాలను తీసుకురావాలని విజ్క్షప్తి చేస్తున్నాను. నేతాజీ సుభాష్​ చంద్ర బోస్ అవశేషాలు భారత్​కు తీసుకురావాలని ఇప్పటికే అనేక సార్లు ఆయన​ కుమార్తె, ప్రొఫెసర్​ అనిత బోస్​తో సహా ఇతర కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మాతృభూమికి నేతాజీ అవశేషాలు తీసుకురాలనేది మా అందరి కోరిక. కాబట్టి ఈ విషయంలో మీరు సానుకూలంగా స్పందించి, నేతాజీ అవశేషాలను భారత్​కు తీసుకురావాలని కోరుతున్నాను అని చంద్ర కుమార్​ బోస్​ తన లేఖలో రాష్ట్రపతికి విన్నవించారు.

Read Also: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>