మంత్రులకు క్లాస్ పీకిన సీఎం చంద్రబాబు..!

కలం, వెబ్ డెస్క్ : నేడు అమరావతి సచివాలయంలో జరిగిన క్యాబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు (Chandrababu) క్లాస్ పీకారు. వైసీపీ విమర్శలకు మంత్రులు సరైన కౌంటర్ ఇవ్వడం లేదని అన్నారు. రైతుల సమస్యలపై ప్రతిపక్షాల విమర్శలకు మంత్రులు సకాలంలో స్పందించడం లేదని ఆగ్రహించారు. ఎప్పటికప్పుడు గట్టి సమాధానం ఇవ్వాలని, ప్రజలకు మంత్రులు వాస్తవాలు వివరించాలని సూచించారు.

అంతేకాదు మంత్రులు చాలా అంశాల్లో వెనుకబడి పోతున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. మంత్రులు తమ శాఖల పనితీరుపై మరింత దృష్టి సారించాల్సి ఉందని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి, కలెక్టర్ కలిసి పనిచేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు క్షేతస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు.

Read Also: భారత్‌ అల్లర్లపై షర్మిష్ఠ సంచలన జోస్యం.. నెట్టింట జోరుగా చర్చ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>