ఉద్యోగులకు గుడ్​న్యూస్​.. డిమాండ్లపై ప్రభుత్వం సానూకూలం!

కలం, వెబ్​ డెస్క్​ : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో (AP Employee Unions) మంత్రుల బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో జరిపిన సమావేశాలు ముగిశాయి. ఐదు గంటలు సాగిన చర్చల్లో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై 21 ఉద్యోగ సంఘాల, పింఛనుదారుల సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం చర్చించింది.

ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లు, పీఆర్సీ, పెండింగ్ అంశాలపై చర్చించారు. ఆర్థిక అంశాలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల (AP Employee Unions) ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్బంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని సంఘాల ప్రతినిధులకు మంత్రుల బృందం వివరించింది.ఈ చర్చల్లో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానూకూలంగా స్పందించినట్లు ఉద్యోగాల సంఘాల అధ్యక్షుడు రామకృష్ణ వెల్లడించారు. పీఆర్సీ, ఐఆర్​ అంశాలు జీవోఎంకు వివరించామన్నారు.

అలాగే, ఉద్యోగులకు ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్సపై స్పష్టత కోరినట్లు చెప్పారు. సచివాలయ శాఖలు అన్ని ఒకే టవర్​ లో ఉండాలని మంత్రుల బృందానికి విజ్ఞప్తి చేశామన్నారు. సీపీఎస్​ పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేసినట్లు వెల్లడించారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారని చెప్పారు.

ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ ప్రత్యక్షంగా హాజరుకాగా.. నాదెండ్ల మనోహర్ వర్చువల్ గా జూమ్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, కార్యదర్శులు వాడ్రేవు వినయ్ చంద్, వీరపాండ్యన్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Read Also: ఏపీలో 43.62 లక్షల ఓట్లు గల్లంతు..? YCP షాకింగ్ ట్వీట్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>