ఏపీలో 43.62 లక్షల ఓట్లు గల్లంతు..? YCP షాకింగ్ ట్వీట్!

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా సవరణపై మరోసారి రాజకీయ వివాదం చెలరేగింది. రాష్ట్రంలో పెద్దఎత్తున ఓట్ల తొలగింపు జరిగిందని వైసీపీ (YCP) కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లనే లక్ష్యంగా చేసుకుని తొలగించారని ట్వీట్ చేసింది. వలసదారుల పేరుతో ఓట్లు తొలగించడంతోపాటు బూత్ లెవల్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించింది. ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) గడువు పొడిగింపుతో మరిన్ని ఓట్లు తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

రాష్ట్రంలోని మొత్తం 4.16 కోట్ల ఓటర్లలో 10.48 శాతం మంది వివరాలు అందుబాటులో లేవని వైసీపీ (YCP) పేర్కొంది. అలాగే 14.87 లక్షల మందిని మరణించారని పేర్కొంటూ, 13.68 లక్షల మందిని వలసదారులుగా నమోదు చేసి, వారి ఓట్లు తొలగించారని ఆరోపించింది. ఈ అంశంపై ఎన్నికల సంఘం స్పందించాలని కోరింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని వైసీపీ డిమాండ్ చేసింది. ప్రస్తుతం వైసీపీ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.

Read Also: పొగాకు రైతులకు మద్దతుగా వైసీపీ పోరాటం : వైఎస్​ జగన్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>