తానూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ జానకి షర్మిల తనిఖీ

కలం, నిర్మల్​ : నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల (Nirmal SP Janaki Sharmila) బుధవారం మహారాష్ట్ర సరిహద్దులోని తానూర్ పోలీస్ స్టేషన్‌ను వార్షికంగా తనిఖీ చేశారు. వన మహోత్సవంలో భాగంగా తానూర్ పాఠశాల విద్యార్థులతో కలిసి సుమారు 300 మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లో శాంతిభద్రతలు, నేర నియంత్రణ, రికార్డుల నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, సీసీ కెమెరాల పనితీరు, దర్యాప్తు పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ముధోల్ సీఐ రవీంద్ర నాయక్, ఎస్‌ఐ షేక్ జుబేర్ ఖాన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: కూచాడి శ్రీహరి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>