కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో 21 ఉద్యోగ సంఘాల, పింఛనుదారుల సంఘాల ప్రతినిధులతో (AP Employee Unions) మంత్రుల బృందం భేటీ అయింది. ఉద్యోగుల డిమాండ్లు, పీఆర్సీ, పెండింగ్ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్ ప్రత్యక్షంగా హాజరుకాగా.. నాదెండ్ల మనోహర్ విర్చువల్ గా జూమ్ మీటింగ్ కు హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, కార్యదర్శులు వాడ్రేవు వినయ్ చంద్, వీరపాండ్యన్, తదితర అధికారులు పాల్గొన్నారు.
మీటింగ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్ఎస్.రావత్, యంటి.కృష్ణబాబు, శశి భూషణ్, ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్, కార్యదర్శులు వాడ్రేవు వినయ్ చంద్, వీరపాండ్యన్, తదితర అధికారులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరపున రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, ఏపీ ఎన్‌జీజీవో సంఘం అధ్యక్షులు విద్యాసాగర్, రాష్ట్ర రెవెన్యూ సర్వీస్, అమరావతి జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.సూర్యనారాయణ, ఇతర ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీలు పాల్గొన్నారు.

