రూ.56 కోట్లతో హనుమకొండలో అభివృద్ధి పనులు

కలం, హనుమకొండ: హనుమకొండలో (Hanamakonda) రూ.56 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ వసతుల అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. వాజ్‌పేయి కాలనీ, ఆర్ అండ్ బీ క్వార్టర్స్, విద్యుత్ నగర్, వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ ప్రాంతాల్లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు, నూతన కార్యాలయం, టీజీఎన్‌పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఐదో అంతస్తు నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో 33/11 కేవీ సబ్‌స్టేషన్, కార్పొరేట్ కార్యాలయంలో అత్యాధునిక సమావేశ మందిరాన్ని ప్రారంభించారు.

ఈ పనులతో హనుమకొండ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సామర్థ్యం పెరగనుందని, వోల్టేజ్ సమస్యలు తగ్గనున్నాయని భట్టి తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>