కలం, నారాయణపేట: బీజేపీ (BJP) ప్రభుత్వ హయాంలో సుమారు 89 పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకున్నాయని యూత్ కాంగ్రెస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు కోట్ల మధుసూదన్ ఆరోపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన ఘటనలను నిరసిస్తూ నారాయణపేట (Narayanpet) జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో బుధవారం నిరసన కార్యక్రమం (Congress Protest) చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అంటేనే పేపర్ లీకేజీల ఫ్యాక్టరీ అని ఆరోపించారు. దేవుళ్ళ పేరుతో రాజకీయం చేయడమే బీజేపీ నైజమన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం రోజురోజుకీ పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన విద్యార్థులకు మద్దతుగా నిలిచిన రాహుల్ గాంధీ అరెస్ట్ బాధాకరమన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ చౌహన్, కార్తీక్ రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు అన్వర్, మండల ఇన్చార్జ్ అప్రోజ్, పళ్ళ అనిల్, ఎన్ఎస్యూఏ సభ్యులు హరీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

