కలం, వెబ్ డెస్క్: సీజేపీ నిరసనలతో ఢిల్లీ (Delhi Protest) దద్దరిల్లిపోతోంది. విద్యార్థి ఉద్యమాలతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఓ నిహాంగ్ సిక్కులు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిరసన సమయంలో ఓ నిహాంగ్ సిక్కు మాట్లాడుతూ.. తమపై దాడులకు దిగినా లేదా పరిస్థితిని తీవ్రతరం చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించాడు. తాము గనుక దాడులు ప్రారంభిస్తే ఎవరినీ వదిలిపెట్టబోమన్నాడు. శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసులను కూడా విడిచిపెట్టేది లేదన్నాడు.
పరిస్థితి హద్దులు దాటితే ఎవరినీ కరుణించేది లేదని, ప్రతిఒక్కరినీ ఒంటిపై గాయాలు తేలేలా కొట్టాల్సి వస్తుందన్నాడు. బాధ్యతాయుతమైన పోలీసులు ఉన్నా, మరెవరైనా ఉన్నా తమ ముందర ఎవరూ మినహాయింపు కాదని స్పష్టం చేశాడు. నిరసన కార్యక్రమంలో చట్టాన్ని, పోలీసులను ఉద్దేశించి ఇలాంటి బహిరంగ బెదిరింపులకు దిగడంతో ఈ ఘటన కలకలం రేపుతోంది. సిక్కుల వ్యాఖ్యలతో అక్కడున్న పోలీసులు, ప్రజలు ఒక్కసారిగా భయపడ్డారు.

