కలం, పెద్దపల్లి: పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగుండం ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వ్యక్తులు మృతి చెందారు. గోదావరిఖని వైపు వెళ్తున్న ఓ లారీ టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై నిలిపివేయగా, అదే మార్గంలో ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం వెనుక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం క్యాబిన్ పూర్తిగా ధ్వంసమై డ్రైవర్, క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదంలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పెట్రోలింగ్‌లో ఉన్న వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీసు సిబ్బంది బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ డ్రైవర్ కూడా మృతి చెందాడు. మృతుడిని మనోహర్‌గా గుర్తించగా, క్లీనర్ వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇద్దరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారేనని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎన్టీపీసీ పోలీసులు వెల్లడించారు.
Read Also: కాంగ్రెస్ ‘చలో లోక్ భవన్’ ఉద్రిక్తత.. టీపీసీసీ చీఫ్ అరెస్ట్!
Follow Us On : WhatsApp

