కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ హై అలర్ట్ ప్రకటించారు. ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో (Delhi Metro) రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని ఐటీఓ, ఢిల్లీ గేట్, ఖాన్ మార్కెట్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా మొత్తం 16 ప్రధాన మెట్రో స్టేషన్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్టేషన్లలోకి ప్రయాణికులను అనుమతించకపోవడంతో పాటు భద్రతను భారీగా పెంచారు. పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ వెలుపల అదనపు బలగాలను మోహరించారు.
ఆందోళనకారుల ప్రవర్తన వల్ల సామాన్య ప్రజలు, నిత్యం ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రయాణికుల సౌకర్యార్థం రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ సదుపాయాన్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మూతపడిన వాటిలో లోక్ కళ్యాణ్ మార్గ్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీం కోర్ట్, సేవా తీర్థ్, జన్ పథ్, ఇంద్రప్రస్థ, జోర్ బాగ్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లు ఉన్నాయి.
Read Also: మహిళా జర్నలిస్ట్‌కు సీజేపీ నిరసనకారుల వేధింపులు!
Follow Us On : WhatsApp

