మ‌హిళా జ‌ర్న‌లిస్ట్‌కు సీజేపీ నిర‌స‌న‌కారుల వేధింపులు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న కాక్రోచ్ జ‌న‌తా పార్టీ నిర‌స‌న‌ల్లో (CJP Protest) అనుచిత ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. మంగ‌ళ‌వారం నిర‌స‌న జ‌రిగిన ప్ర‌దేశాల్లో విధులు నిర్వహిస్తున్న ప‌లువురు జ‌ర్న‌లిస్ట్‌ల‌ను సీజేపీ మ‌ద్ద‌తుదారులు తీవ్ర వేధింపుల‌కు గురి చేశారు. మ‌హిళ అని కూడా చూడ‌కుండా ఓ జ‌ర్న‌లిస్ట్‌ను అస‌భ్యంగా తాకుతూ దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌హిళ‌ల‌తో పాటు గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తున్న మ‌రికొంద‌రు రిపోర్ట‌ర్‌ల‌పై కాక్రోచ్ పార్టీ మ‌ద్దతుదారులు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు. త‌న‌ను సీజేపీ మ‌ద్ద‌తు దారులు కొట్టార‌ని ఓ జ‌ర్న‌లిస్ట్ ఆరోపించాడు. మ‌రో జ‌ర్న‌లిస్ట్ దుస్తులు చించివేసి అత‌డిపై దాడికి పాల్ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని, ఈ హింసాత్మక గుంపుల్లో మహిళలు, యువతులు సురక్షితంగా లేరని ప‌లువురు జ‌ర్న‌లిస్ట్‌లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>