జ‌పాన్‌లో ఎండ‌లు.. మ‌నుషుల కోసం ఫ్రిడ్జ్‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: జపాన్‌ (Japan)లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడి కంపెనీలు వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్‌డీఆర్‌ఎస్ అనే సంస్థ, వెండింగ్ మెషిన్ల స్ఫూర్తితో ఒక్క మ‌నిషి ప‌ట్టే విధంగా డూ హీమోన్ బాక్స్ పేరిట ఒక హ్యూమన్ రిఫ్రిజిరేటర్‌ (Human Refrigerator)ను రూపొందించింది. ట్రస్కో నకయామా సంస్థ ఈ ఫ్రిడ్జ్‌ల‌ను అమ్ముతోంది. ఈ పోర్టబుల్ బాక్స్‌లో ఎప్పుడూ 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్ర‌త‌ ఉంటుంది. ఇందులో ఒక కుర్చీ ఉంటుంది. కుర్చీలో కూర్చోగానే సుమారు 5 డిగ్రీల సెల్సియస్ చల్లని గాలి తల, మెడ, వీపు భాగాలపై వీచి శరీరాన్ని తక్షణమే చల్లబరుస్తుంది. సుమారు ఐదు నుండి పది నిమిషాల్లోనే ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వడదెబ్బ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుందని కంపెనీ తెలిపింది.

ముఖ్యంగా నిర్మాణ రంగాలు, ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌లు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు ఈ పరికరం ఎంతగానో ఉపయోగపడనుంది. టైమర్ ఆధారంగా పని చేసే ఈ ఫ్రిడ్జ్‌ బాక్స్, దాదాపు సాధారణ స్పాట్ ఏసీ కంటే సగం విద్యుత్‌ను మాత్రమే వినియోగిస్తుంది. చక్రాలు ఉండటంతో దీనిని అవసరమైన చోటుకి సులభంగా తరలించవచ్చు. టోక్యోలో ఇటీవల తీవ్రమైన వేడి కారణంగా అనేక మంది ఆసుపత్రిపాలవుతున్న నేపథ్యంలో, వ్యాపార సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు ఈ వినూత్న మార్గాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రస్తుతం ఈ హ్యూమన్ రిఫ్రిజిరేటర్ ప్రామాణిక మోడల్ ధర 15 లక్షల యెన్లు, భార‌తీయ క‌రెన్సీలో రూ.8.5 ల‌క్ష‌ల నుంచి రూ.9 ల‌క్ష‌లుగా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>