UTT 7: గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన టేబుల్ టెన్నిస్ స్టార్ సోఫియా

కలం, వెబ్ డెస్క్: గోవా వేదికగా ప్రస్తుతం అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యుటిటి) ఏడో సీజన్ లీగ్ మ్యాచ్‌లు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో అహ్మదాబాద్ ఎపిఎల్ పైపర్స్ తరఫున ఆడుతున్న ఆస్ట్రియా స్టార్ ప్లేయర్ సోఫియా పోల్కనోవా (Sofia Polcanova) అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మొదటి రెండు సీజన్లలో పాల్గొన్న ఆమె, ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఈ లీగ్‌లోకి అడుగుపెట్టారు. ఆరంభంలో అనేక సవాళ్లు ఎదుర్కొన్న సోఫియా, ఆస్ట్రియా క్రీడా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన అథ్లెట్‌గా నిలిచారు. మూడుసార్లు ఒలింపియన్ అయిన ఆమె, యూరోపియన్ మాజీ నంబర్ వన్, ప్రపంచ మాజీ పదో ర్యాంకర్‌గా ఘనతలు సాధించారు.

అంతేకాకుండా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకంతో పాటు రెండుసార్లు యూరోపియన్ సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, లీగ్‌లో వచ్చిన మార్పుల గురించి వివరించారు. గతంలో ఇద్దరు విదేశీ మహిళా ప్లేయర్లు, ఇద్దరు విదేశీ పురుషుల ప్లేయర్లు ఉండేవారని, ప్రస్తుతం విధానం మారిందని పేర్కొన్నారు. మ్యాచ్‌ల వ్యవధి తగ్గడం వల్ల ప్రతి సెట్, గేమ్ చాలా కీలకంగా మారిందని, ఇది ఎంతో ఒత్తిడితో కూడుకున్నప్పటికీ ఆట ఎంతో సరదాగా సాగుతోందని చెప్పారు. సుమారు మూడు వారాల పాటు సాగే ఈ లీగ్‌లో మానసిక స్థిరత్వం చాలా అవసరమని సోఫియా అభిప్రాయపడ్డారు.

గెలిచినా ఓడినా విశ్రాంతి తీసుకోకుండా ప్రశాంతంగా ఉండటానికి యుటిటి ఒక మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. ఇటీవల దబాంగ్ ఢిల్లీకి చెందిన మారియాక్సియావోపై సాధించిన విజయం గురించి సోఫియా స్పందిస్తూ, ఐదు వారాల క్రితం డబ్ల్యూటిటి ఈవెంట్‌లో ఆమె చేతిలో ఓడిపోయానని గుర్తుచేసుకున్నారు. ఆ చేదు అనుభవాన్ని అధిగమించి గెలవడానికి ఈ మ్యాచ్‌ను ఒక మంచి అవకాశంగా భావించానని చెప్పారు. రెండో గేమ్‌లో 9-3 ఆధిక్యంలో ఉండి కూడా ఓడిపోవడం నిరాశ కలిగించినా, అంతిమంగా మ్యాచ్ గెలవడం సంతృప్తినిచ్చిందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>