epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫోన్​ ట్యాపింగ్​ కేసు.. నందకుమార్​ ఏం చెప్పారంటే?

కలం, వెబ్​ డెస్క్​ : ఫోన్​ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)కు సంబంధించి విచారణను సిట్ (SIT Inquiry) వేగవంతం చేసింది. ఈ మేరకు దక్కన్​ కిచెన్​ యజమాని నందకుమార్ విచారణకు​ హాజరయ్యారు. గురువారం జూబ్లీహిల్స్ పోలీస్​ స్టేషన్​ లో నందకుమార్​ ను సిట్ అధికారులు విచారించారు. తన ఫామ్ హౌస్​ లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆడియోలు బయటకు రావడంపై సిట్​ అధికారులు నందకుమార్​ ను ప్రశ్నించారు.

విచారణ అనంతరం నందకుమార్(Nandakumar) మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలోనే తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని సిట్ విచారణలో చెప్పానన్నారు. తాను స్వామీజీలు మాట్లాడుకున్న విషయాలను అప్పటి సీఎం కేసీఆర్​ బహిర్గతం చేసిన అంశంపై విచారణ జరిగిందన్నారు. కేసు(Phone Tapping Case)కు సంబంధించి తనపై రాధా కిషన్​ రావు అక్రమ కేసులు పెట్టారని నందకుమార్​ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై అప్పటి డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశానని చెప్పారు. పోలీస్​ విచారణకు పూర్తిగా స్పందిస్తానని నందకుమార్​ తెలిపారు.

Read Also: జాతీయ నాయకులను విస్మరించిన కాంగ్రెస్​: ప్రధాని మోదీ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>