epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

2025 టాప్ 10 మూవీస్ ఇవే..

కలం, వెబ్ డెస్క్​ : 2025.. అయిపోతోంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. తెలుగు, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో ఈ సంవత్సరంలో పలు విభిన్న కథా చిత్రాలు వచ్చాయి. కొన్ని మనసుకు నచ్చి.. బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తే.. కొన్ని అంచనాలను అందుకోలేక బోల్తాపడ్డాయి. మరి.. ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఈ సంవత్సరం టాప్ టెన్ లిస్ట్ (Top 10 Indian Movies) ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..

మలయాళంలో రూపొందిన ఎల్ 2 ఎంపురాన్ చిత్రం దాదాపు 268 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 10లో నిలిచింది. ఇక తెలుగు సినిమా పవర్ స్టార్ ఓజీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా దాదాపు 283 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈ సంవత్సరం టాప్ 9 లో చోటు దక్కించుకుంది. మలయాంళం నుంచి మరో విభిన్న కథా చిత్రం లోక చిత్రం దాదాపు 300 నుంచి 303 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 8లో నిలిచింది.

ఇక సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ కలిసి నటించిన మూవీ వార్ 2. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా నిరాశపరిచింది. అయితే.. కలెక్షన్స్ చూస్తే.. దాదాపు 351 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 7 లో నిలిచింది.  మహావతార్ యానిమేషన్ ఫిల్మ్ ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ రాబట్టింది. కన్నడలో రూపొందిన ఈ సినిమా తెలుగులో కూడా భారీగా కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమా 326 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 6లో చేరింది.

ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్‌ కనకరాజ్ కాంబోలో రూపొందిన సినిమా కూలీ. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది కానీ.. కలెక్షన్స్ మాత్రం దాదాపు 550 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 5లో చేరింది. బాలీవుడ్ మూవీ సయ్యారే విభిన్న ప్రేమకథా చిత్రంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 579 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 4లో స్థానం దక్కించుకుంది.

బాలీవుడ్ లో సెన్సేషనల్ మూవీగా నిలిచింది ఛావా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 797 కోట్లు కలెక్ట్ చేసి టాప్ 3లో నిలిచింది. ఇక టాప్ 2 లో కాంతర చాప్టర్1 నిలిచింది. ఈ సినిమా దాదాపు 900 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక టాప్ 1 లో నిలిచిన సినిమా ధురంధర్. ఈ క్రేజీ మూవీ 901 కోట్లు కలెక్ట్ చేసింది. 1000 కోట్లు దిశగా దూసుకెళుతుంది. మరి.. ధురంధర్ ఇంకా ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>