నిర్మల్​ వాసులకు అలర్డ్​.. ఆ ప్రాంతాల్లో రేపు పవర్​ కట్​

కలం, నిర్మల్​ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు, నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేపట్టనున్న నేపథ్యంలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, మదీనా కాలనీ, న్యూ ఫిష్ మార్కెట్, ఇరిగేషన్ కార్యాలయం, మారుతీ ఇన్ హోటల్, ఆల్ఫోర్స్ కాలేజ్, ఢిల్లీ వరల్డ్ స్కూల్, ఎంకే ట్రేడర్స్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. నిర్వహణ పనులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని, ఆయా ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>