కలం, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూరు (Armoor) నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య “సోషల్” వార్ తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల పోటాపోటీ నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. ఆర్మూర్ మండలం అంకాపూర్ లో బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. దీంతో అంకాపూర్‌లో తన ఇంటి వద్ద ఉంటానని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ప్రకటించడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.
రెండు పార్టీల కార్యక్రమాలతో ఆర్మూర్‌లో (Armoor) ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ బైక్ లు ఇస్తానని మోసం చేశారని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు కూడా దీటుగా విమర్శలు గుప్పించారు. రాకేశ్ రెడ్డి గెలిస్తే.. గ్రామాల్లో రూపాయికి వైద్యం చేస్తానని, ఊరూరా సొంత డబ్బులతో ఇల్లు కట్టిస్తానని చెప్పారని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తూ హామీలను గుర్తు చేశారు. ఇక సోషల్ వార్ కూడా తారాస్థాయికి చేరింది. సోమవారం ఆందోళనలు చేస్తారనే ఉద్దేశ్యంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆర్మూర్‌లో ప్రధాన కూడళ్ళలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. రెండు పార్టీల హెచ్చరికలతో ఆర్మూర్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Read Also: మహేశ్ టార్గెట్.. అర్బన్ సీట్!
Follow Us On : WhatsApp

