నల్లగొండలో 163 సెక్షన్ విధింపు: ఎస్పీ శరత్ చంద్ర పవార్

కలం, నల్లగొండ: నకిరేకల్ మండలం మూసీ గ్రామానికి చెందిన మత్స్య శాఖ సహకార సంఘం లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నల్గొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో మిర్యాలగూడ రోడ్డులోని (డీటీసీ సమీపంలో) మహిళా సమాఖ్య భవన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా జులై 20, 21వ తేదీల్లో భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 163 (పూర్వపు సీఆర్‌పీసీ సెక్షన్ 144) అమలులో ఉంటుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

ఎన్నికలపై ప్రత్యేక నిఘా..

ఎన్నికల ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ కేంద్రంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వివరించారు.

సెక్షన్ 163 అమలులో ఉన్నందున ఎన్నికల కేంద్రం పరిసరాల్లో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా చేరడం పూర్తిగా నిషేధమని ఎస్పీ స్పష్టం చేశారు.

ర్యాలీలు, ఊరేగింపులు నిషేధం..

అనుమతి లేని ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసనలు, సభలు నిర్వహించడానికి వీల్లేదని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించినా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఓటర్లు, మద్దతుదారులు ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Read Also: జొన్న రొట్టె తినడమే మేలు: విప్ బీర్ల అయిలయ్య

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>