కలం వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా క్రిస్మస్(Christmas) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలతో సందడి నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెథడ్రల్(Cathedral) చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. మానవత్వం, ప్రేమ, శాంతి, సామరస్యం వంటి విలువలపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. సమాజంలో సహకారం, సేవ, సహనం వంటి లక్షణాలను పెంపొందించాలని సూచించారు. ఈ క్రిస్మస్ పర్వదినం సర్వ మత ప్రజలకు శాంతి, సంతోషం, ఐక్యతను పంచాలని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు. ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: దుమ్ముదులిపిన దేవదత్ పడిక్కల్.. కర్ణాటక పేరిట మరో రికార్డ్
Follow Us On: Youtube


